Assembly126 | 126 సీట్లకు 95 చోట్ల ఆధీక్యం
Assembly126 | 126 సీట్లకు 95 చోట్ల ఆధీక్యం
Assembly126 | కేవలం 29 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్
మరోసారి సీఎంగా హిమంత్ బిశ్వ శర్మ
అసోం : మొత్తం స్థానాలు 126
బీజేపీ కూటమి : 95
కాంగ్రెస్ : 29
ఇతరులు : 2
Assembly126 | ఎలక్షన్ డెస్క్, ఆంధ్రప్రభ : అసోంలో ఎన్టీఎ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది.. ఈ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి ఇప్పటికే 95 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ కూటమి 29స్థానాల్లో లీడ్‌లో ఉంది.. ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకున్నట్లే.. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మమరోసారి సీఎం కానున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాగా, ఇక్కడ 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా.. 85.96శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఉన్నారు. అసోంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 126.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన “మ్యాజిక్ ఫిగర్” 64.. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన 85.38 ఓటింగ్ శాతం.. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో “ఎన్డీఏ” కూటమి గెలుపుదిశగా వెళుతుండగా, రెండో సారి ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆయన అస్సాంలోని జలుక్ బరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. అక్కడ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి హిమంత 25 ఏళ్లుగా ఏమ్మెల్యేగా ఉన్నారు.ఈ సీటును బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్‌పై హిమంత విజయం సాధించారు.. ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ కూడా గెలుపొందారు.

CLICK HERE TO READ MORE : tvkvijay | దళపతి రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టాలు!
