may4price | స్థిరంగా బంగారం, వెండి ధరలు
may4price | స్థిరంగా బంగారం, వెండి ధరలు
may4price | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులతో అయోమయానికి గురిచేశాయి. రెండు రోజులు పెరిగితే.. మరో రోజు తగ్గడం జరిగింది. దీంతో గోల్డ్ రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియన కొనుగోలుదారులు తికమక పడ్డారు. అసలే పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో బంగారం కొనడం తప్పనిసరి. బంగారం ధర పెరుగుతుంటే విక్రయదారులు బెంబేలెత్తారు. అయితే ఇవాళ బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దేశంలో వీటి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం భారీగా పెరిగిన ధరలు వరుసగా నిలకడగా కొనసాగడం పసిడి ప్రియులకు ఊరటనిచ్చే విషయం. ఇక వెండి ధరలు సైతం వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు (4 మే 2026):
24 క్యారెట్లు (10 గ్రాములు ): ₹1,50,930
22 క్యారెట్లు (10 గ్రాములు): ₹1,38,350
18 క్యారెట్లు (10 గ్రాములు): ₹1,13,200
