ఈశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం…

ఈశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం…

పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)….

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : స్థానిక చెరువు కట్ట బజారులోని దాసరి పల్లెలో, దాసరి కుల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, గజ్జి కృష్ణమూర్తి, కల్లూరి శ్రీవాణి, దాసరి కుల సంఘ ప్రతినిధులు, అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.