ఆప్తులకు ఆసరాగా ” సాయన” చేయూత…

ఆప్తులకు ఆసరాగా ” సాయన” చేయూత…

సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ

మచిలీపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : ఆప్తులకు ఆసరాగా రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాయన సుశీలరావు చేయూతనిస్తున్నారని ప్రముఖ న్యాయవాది మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ కొనియాడారు.

సాయన సుశీలరావు తన తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన సాయన వీరభద్రయ్య – వీర రాఘవమ్మ సేవా సమితి ద్వారా ఆదివారం ఉదయం స్థానిక జగన్నాధపురం లోని లంకెశెట్టి బాలాజీ కార్యాలయంలో ఇరువురు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు చొప్పున ఇరువురికి 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

బాలభాను విద్యాలయం కు చెందిన మన్యం రెడ్డి ధనశ్రీ , సాయి చరణ్ 9వ తరగతి పూర్తి చేసుకుని పదిలోకి వచ్చారు. వీరి తండ్రి ఏడేళ్ల క్రితం అకాల మరణానికి గురికాక తల్లి కిరణ్మయి కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిస్తోంది.

వీరి పరిస్థితిని తెలుసుకున్న సుశీల రావు వారి చదువు నిమిత్తం ఈ సాయాన్ని అందజేశారని బాలాజీ పేర్కొన్నారు .

ప్రతినెలా క్రమం తప్పకుండా దాదాపు ఐదేళ్ల నుంచి ఇరువురు విద్యార్థులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు .

అమెరికాలో ఉంటున్న సుశీల రావు కుమార్తె సాయన సంధ్య అందిస్తున్న ఈ సాయంతో ఎంతోమంది పేద ప్రతిభగల విద్యార్థులు తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ సాయం ఎంతగానో దోహదపడుతుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.

విద్యాదాత సుశీల రావు మాట్లాడుతూ చదువుకు సాయ పడాలనే తత్వం తమకు తన తండ్రి నుంచి అలవాటుగా వచ్చిందన్నారు. చదువుతో వ్యక్తి వికాసం పెరుగుతుందని అందుకు దోహాదపడే సాయం తన తల్లిదండ్రుల పేరు మీద చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ప్రతిభగల విద్యార్థులకు అందిస్తున్న ఈ సాయంలో తన కుమార్తె సంధ్య పాలు పంచుకోవడం పుత్రోత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. చదువుకు సాయపడాలనే విధానం సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రతినెలా ఇరువురు విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు.

ఎస్ బి ఐ రిటైర్డ్ ఏజీఎం ఎల్ ఎస్ ఎస్ వి డి హనుమంతరావు మాట్లాడుతూ సాయన సుశీలరావు తన తల్లిదండ్రుల పేరు మీద విద్యార్థులకు అందించే సాయం తన చేతుల మీదుగా జరగడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. విశ్రాంతి పోలీస్ అధికారి ఐన సుశీలరావు చదువు కు సేవ విషయంలో మాత్రం అవిశ్రాంతిగా పని చేస్తున్నారన్నారు ఈయన చేసే సేవ వల్ల సమాజం తప్పక వికసించడం జరుగుతుందన్నారు.

Leave a Reply