పత్రికా స్వేచ్ఛతోనే సమాజ శ్రేయస్సు..
పత్రికా స్వేచ్ఛతోనే సమాజ శ్రేయస్సు..
ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పత్రికా స్వేచ్ఛా దినోత్సవం..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: పత్రికా స్వేచ్ఛతోనే సమాజ శ్రేయస్సు, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ కార్యదర్శి బి.డేవిడ్ రాజు అన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు పత్రికా ధర్మాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు.
దిగజారుడు జర్నలిజంలో వృత్తికి కళకం తీసుకురాకూడదని హితువు పలికారు. ప్రెస్ క్లబ్ ఏవో బాషా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సమాజానికి ఉపయోగపడే జర్నలిజం చేసినప్పుడే గౌరవం ఉంటుందన్నారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు సంపసాల నాగరాజు పుట్టిన రోజు సందర్భంగా కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాంబాబు, జాయింట్ సెక్రటరీ రహీం, మాజీ అధ్యక్షుడు హఫీజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
