ఈనెల 4న ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ
ఈనెల 4న ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ
-చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఈనెల 4వ తేదీ నుండి ప్రతి సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది ని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి వి. శేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, వలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యల గురించి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకొనుటకు గాను చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డివిజన్ లోని 5 మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు.
