రైతులకు అందుబాటులో ఎరువులు..

చిట్యాల, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్లో రైతులకు అందుబాటులో ఎరువులు ఉండేందుకు ఆకా సెంటర్లు నూతనంగా ప్రవేశపెట్టినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం మండలంలోని ఎలేటి రామయ్య పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకా సెంటర్ ను ఎమ్మెల్యే జిఎస్సార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్లో రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా ముందస్తు ప్రజాపాలన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికిపాటుపడుతుందన్నారు.

రైతులు తక్కువ పెట్టు బడి కోసం యూరియా, డి ఎ పి, పొటాష్ ,లిక్విడ్ పిచికారి చేసుకొని అధిక లాభాలు పొందవచ్చునున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు రైతులు కొనుగోలు చేయాలని, ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామ సర్పంచ్ కొడారి అశోక్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడారి అశోక్, కాంగ్రెస్ నాయకులు గూట్ల తిరుపతి ,దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమరయ్య ,గంగాధరి రవీందర్ , అల్లం రాజు, గుర్రపు తిరుపతి, చింతల సుమన్, ఏలేటి శ్రీనివాస్, రైతులు, పాల్గొన్నారు.

Leave a Reply