Sunrisershyd | క్లాసెన్ సింప్లిసిటీపై నెటిజ‌న్లు ఫిదా

Sunrisershyd | క్లాసెన్ సింప్లిసిటీపై నెటిజ‌న్లు ఫిదా

కుటుంబంతో ఆటోలో చ‌క్క‌ర్లు
సిటీ అందాల‌ను ఆస్వాదించిన స్టార్ క్రికెట‌ర్‌
అభిమానుల‌కు హాయ్ చెబుతూ ప‌ల‌క‌రింపు

Sunrisershyd |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెన్ గురించి తెలియ‌నివారుండ‌రు. అత‌ను గ్రౌండ్‌లో దిగాడంటే కాటేర‌మ్మ పెద్ద కొడుకులా రెచ్చియి ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌డ పుట్టిస్తాడు. మాస్ ఇన్నింగ్స్‌ల‌తో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. మైదానంలో సిక్సుల‌తో సింహంలా రెచ్చిపోయే క్లాసేన్‌.. బ‌యట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటూ అభిమానుల మ‌న‌సును గెలుచుకుంటున్నాడు.

Sunrisers

మ్యాచ్‌ల మధ్యలో విరామం దొర‌క‌డంతో హెన్రిచ్ క్లాసెన్ కుటుంబంతో క‌లిసి హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టాడు. అదీ ఏ ల‌గ్జ‌రీ కారులోనో కాదండి… ఓ సాధార‌ణ మ‌నిషిలా ఆటోలో ప్ర‌యాణం చేస్తూ నగర అందాలను ఆస్వాదించారు. కుమార్తెతో కలిసి ఆటోలో కూర్చొని ప్రయాణిస్తూ నగరాన్ని చుట్టేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రోడ్లపై వెళ్తున్నప్పుడు తనను గుర్తుపట్టిన అభిమానులకు చిరునవ్వుతో హాయ్ చెబుతూ, తన కూతురితో కలిసి క్లాసేన్ చేస్తున్న ఈ క్యూట్ హంగామాకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sunrisers

CLICK HERE TO WATCH VIDEO

Leave a Reply