telangana rakshana sena | ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
telangana rakshana sena | ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
telangana rakshana sena | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన ఐదు ప్రధాన అంశాలను కేంద్రబిందువుగా తీసుకుని ముందుకు సాగుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‍లో మీట్ ది ప్రెస్‍లో మాట్లాడిన కవిత తాను స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై పలు కీలక అంశాలు వెల్లడించారు.
పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు రైతులు, యువత, మహిళల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఎంత పెద్ద అనారోగ్య సమస్య వచ్చినా పేదలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని కవిత పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య కూడా అందాలని ఆమె అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని, ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
ప్రభుత్వాలు ఇస్తున్న హామీల వల్ల ఉపాధి అనే పదమే హాస్యాస్పదంగా మారిందని కవిత అన్నారు. తాము చెప్పే ఉపాధి కల్పన అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని, యువత, మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు.
