అంగన్‌వాడీ టీచర్ సావిత్రికి ఘన సన్మానం

అంగన్‌వాడీ టీచర్ సావిత్రికి ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం లింగాపూర్ గ్రామంలోని ఒకటవ అంగన్‌వాడీ కేంద్రం టీచర్ కొలిపాక సావిత్రి పదవీ విరమణ పొందారు. శనివారం లింగాపూర్ గ్రామంలో సావిత్రికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల బాలవ్వ, లచ్చన్న, ఎలగడప ఎంపీపీఎస్ పాఠశాల హెచ్ఎం కూచనపల్లి శ్రీనివాస్, ఆదరణ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ముంజ వెంకట రమణ పాల్గొన్నారు.

అలాగే పద్మశాలి సంఘం అధ్యక్షులు కట్ట రాజేంద్ర ప్రసాద్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొలిపాక రాఘవేంద్ర, లింగాపూర్ మీసేవ కోఆర్డినేటర్ భూషణవేణి మహేష్, పబ్లిక్ ప్రిఫర్ పీస్ సలహాదారు నేదురి జాకబ్, యూత్ సభ్యులు కొలిపాక యోగేష్, టీఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ నేదురి విజయ నిర్మల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు సావిత్రికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అంగన్‌వాడీ టీచర్‌గా ఆమె గ్రామంలోని చిన్నారులకు, గర్భిణులకు అందించిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని సావిత్రికి శుభాకాంక్షలు తెలిపారు.