చెన్నూరులో ఘనంగా మేడే సంబరాలు

చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రపంచ కార్మిక దినోత్సవ (మే డే )వేడుకలు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ కేంద్రంలో స్థానిక కార్మిక లోకం ఘనంగా జరుపుకున్నాయి. మేడే పురష్కరించుకొని ప్రధాన కూడలిల వద్ద వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండా లు ఎగురావేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్, రాజీవ్ రోడ్, ప్రధానవీధులలో డిజే సౌండ్ ల మధ్య నృత్యలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
