CI | ఉన్నతాధికారుల చర్య..

CI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది.
బుధవారం ఓ మహిళ వినుకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ, ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న తనపై సీఐ చిన్నమల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం వరకు సీఐడీలో పనిచేసి ప్రస్తుతం వీఆర్లో ఉన్న చిన్నమల్లయ్యపై గతంలోనూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేశాడనే ఆరోపణలున్నాయి.
