Sameer Rizvi22yrs | వారిద్దరూ ప్రేమలో పడ్డారు?

Sameer Rizvi22yrs | వారిద్దరూ ప్రేమలో పడ్డారు?
Sameer Rizvi22yrs | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ అంటేనే సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇందులో కొన్ని వార్తలు హాట్ టాపిక్‌గా మారుతాయి. ఈ సీజన్లో ఢిల్లీ జట్టు యువ ఆటగాడు సమీర్ రిజ్వీ, యాంకర్ యెషా సాగర్ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. 22 ఏళ్ల సమీర్ రిజ్వీ 29 ఏళ్ల యెషాసాగర్ ఇద్దరూ ప్రేమలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
వీరిద్దరి మధ్య బంధం గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని చర్చ జరుగుతోంది. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వారిద్దరి సన్నిహిత ఫోటోలు, వారు ఒకరి పోస్టులకు మరొకరు చేసుకునే కామెంట్లను బట్టే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ రూమర్లపై సమీర్ రిజ్వీ గానీ, యెషా సాగర్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే వీరి వయసు తేడాను బట్టి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తక్కువ వయసు ఉన్న యువకుడితో యెషా సాగర్ ప్రేమలో పడటంపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు “ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు” అని మద్దతు ఇస్తుంటే, మరికొందరు మాత్రం ఈ జంటపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి వయస్సు వ్యత్యాసాలు కొత్తేమీ కాదని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
