fire | కార్లు, బైక్ లు దగ్ధం
fire | కార్లు, బైక్ లు దగ్ధం
fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా ట్యాంకు పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పేలుడు ధాటికి కారు పూర్తిగా మంటల్లో చిక్కుకోగా, పక్కనే పార్క్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం కూడా దగ్ధమయ్యాయి. భారీ శబ్దంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
