మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో ఇటీవల అకాల మరణం చెందిన వ్యక్తి కుటుంబానికి పరకాల పురపాలక సంఘం 9వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.
పట్టణంలోని 4వ వార్డు పరిధికి చెందిన అలిసెరి స్వామి కుటుంబాన్ని బెజ్జంకి పూర్ణ చారి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా బియ్యం, కిరాణా సామగ్రిని అందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, పార్టీ నాయకులు దాసరి రవి, కందికొండ జస్వంత్, అలాగే కాలనీ వాసులు మాస రాజేందర్, దేవరకొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీజేపీ నాయకులు భరోసా ఇచ్చారు.
