నాలుగో వార్డులో కాంగ్రెస్ జోరు..

నాలుగో వార్డులో కాంగ్రెస్ జోరు..

  • అభ్యర్థి బూర్ల శంకర్ గెలుపు ఖాయం
  • ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన
  • గెలుపు ఖాయం అంటున్న ప్రజానీకం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల శంకర్ అభివృద్ధే అజెండాగా ప్రజల ముందుకు రావడంతో వార్డులో రాజకీయ వేడి పెరిగింది. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బూర్ల శంకర్‌కు అపూర్వ స్పందన లభించింది. కాలనీల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ప్రకటించడంతో ప్రచారం ఉత్సాహంగా సాగింది. 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేదల కష్టాలను దగ్గరగా తెలిసిన వ్యక్తిగా బూర్ల శంకర్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

మూడు సార్లు ఎంపీటీసీగా, ఒకసారి వార్డు సభ్యుడిగా, అలాగే పీఏసీఎస్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులతో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి అంటే శంకర్ అన్న అనే పేరును ప్రజల్లో నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇస్తూ వారికి అవకాశాలు కల్పించే దృక్పథంతో ముందుకు సాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనే నాయకత్వం చూపిన నేతగా శంకర్ అన్నకు ప్రజల మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఎన్ని కల ప్రచారంలో బూర్ల శంకర్ దూసుకుపోతున్నారు. నాలుగో వార్డులో ఆయన గెలుపు పక్కా అని ఓటర్లు స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. కాంగ్రెస్ జెండా నాలుగో వార్డులో పక్కాగా ఎగురుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.