హమాలీల కొరతతో మొక్కజొన్న ఏగుమతి దిగుమతులకు ఆటంకాలు

హమాలీల కొరతతో మొక్కజొన్న ఏగుమతి దిగుమతులకు ఆటంకాలు

మహేశ్వరంలో రైతుల రాస్తారోకో
80వేల బస్తాల దిగుమతి ఆలస్యం.
పిఏసిఎస్ కార్యదర్శి పై పోలీస్ స్టేషన్లో కేసు

నర్సంపేట, ఆంధ్రప్రభ : ఒకవైపు హమాలీల కొరత మరోవైపు అకాల వర్షాలతో మొక్కజొన్న రైతులు ఆగమాగం అవుతున్నారు రైతుల గోడు పట్టించుకోవడంలో అధికారులు ప్రజాప్రతినిధులు సైతం కన్నెర్ర చేస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో హమాలీల కొరతతో 80 వేల బస్తాలు ఎగుమతులు, కాంటాలు కాక నెల రోజుల నుండి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నల్లవెల్లి దుగ్గొండి మండలాలకు సంబంధించిన మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి మార్క్ పెడ్ అధికారులు ఏర్పాటు చేసిన గోదాంలో హమాలీల కొరత ఏర్పడడంతో సుమారు వేలాది బస్తాల తీసుకొచ్చిన రైతులు వరంగల్ నర్సంపేట రోడ్డుపై మహేశ్వరం లో బుధవారం రాస్తారోకో దిగారు. అధికారుల నిర్లక్ష్యం తోనే ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు.

మహేశ్వరంలో సుమారు 100 ట్రాక్టర్లతో వచ్చిన రైతులు దిగుమతులు గాక ఇబ్బందులు పడుతూ రాస్తారోకోకు దిగినట్లు పలువురు రైతులు ఆంధ్రప్రభ కు తెలిపారు. సుమారు వేలాది బస్తాల మొక్కజొన్నలు దిగుమతు లు చేసుకోవడంలో ఇబ్బందులు పెడుతున్నార ని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు ఏర్పాటు చేసిన ప్రైవేటు గోదాంలో దిగుమతి చేసుకోవడానికి ఎండలకు హమాలీలు రాకపోవడం తీవ్ర ఇబ్బందులను పడుతున్నట్లు నిర్వాహకు లు పేర్కొన్నారు. నర్సంపేట మార్కెట్ లో మార్కెట్ అధికారులు గోదాము ఏర్పాటు చేసి దిగుమతి చేసుకోవడానికి హమాలీల కొరత తీవ్రంగా ఉందని సొసైటీ కార్యదర్శి రాజు తెలిపారు. 60 వేల బస్తాలు గోదాంలో దిగుమతి చేయవలసి ఉందని మరో 20 వేల బస్తాల కాంటాలు కావలసిందని రాజు వివరించారు మొక్కజొన్న రైతులకు ఎగుమతి దిగుమతి అన్ని హమాలీల కొరతతో ఆలస్యం అవుతుందని రాజు వివరించారు. ఏది ఏమైనప్పటికీ ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే తగిన సరిత తీసుకుని అమాలి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి కాంటాల ఎగుమతి దిగుమతులు వెంట వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూన్నారు. ఇదే పరిస్థితి నెలకొంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడి అవకాశాలున్నట్లు రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న లను వెంట వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించిన ప్పటికీ కిందిస్థాయి అధికారులు పట్టించుకోవ డంలేదని, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ రమణారెడ్డి కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా లక్ష ఎకరాల కు పైగా పండించిన మొక్కజొన్న పంటలను లక్షల మార్కెట్ తరలించారు. అయినప్పటికీ మొక్కజొన్నలను అధికారులు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలంలో రైతుల ఇబ్బందులను తొలగించడానికి అధికంగా హమాలీలను ఏర్పాటు చేసి దిగుమతులను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సొసైటీ కార్యదర్శి పై పోలీస్ స్టేషన్లో కేసు :

సొసైటీ కార్యదర్శి తడుక రాజు నిర్లక్ష్యంతో మొక్కజొన్న కాంటాలు పెట్టడం లేదని వర్షా నాయక్ తండాకు చెందిన రైతులు నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినట్టు తెలిపారు. ఈ విషయంలో తడక రాజు మాట్లాడుతూ తాగిన మైకంలో ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దాడి చేయడానికి ప్రయత్నించిన గిరిజన రైతులు తనపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి చంపుతామని బెదిరిస్తున్నట్లు తెలిపారు.

రెండు రోజుల్లో దిగుమతు లు పూర్తి చేస్తాం :
ఆర్డీవో ఉమారాణి.

నర్సంపేట డివిజన్లో రైతులు పండించిన మొక్కజొన్నలను ఎగుమతి దిగుమతులను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని నర్సంపేట ఆర్డీవో ఉమారాణి రైతులకు తెలిపారు మహేశ్వరంలో ధర్నా చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ప్రైవేట్ గోదాములను గుర్తించి వెంటనే ధాన్యం తరలిస్తామని, హమాలీ కార్మికుల కొరత అధికంగా ఉందని వారిని కూడా ఇతర ప్రాంతాల నుండి రప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

Leave a Reply