నగర సంకీర్తనతో హిందూ సమ్మేళన కార్యక్రమానికి విస్తృత ప్రచారం

చిట్యాల, ఆంధ్రప్రభ ; నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఈ నెల 5వ తేదీన సాయంత్రం గ్రీన్ గో పాఠశాలలో నిర్వహించనున్న హిందూ సమ్మేళన సమితి కార్యక్రమానికి ముందస్తుగా శనివారం విస్తృత ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పట్టణంలోని అన్ని వార్డుల్లో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేస్తూ, హిందూ సోదరులందరికీ ఆహ్వాన పత్రాలను అందజేశారు. వార్డుల్లో కోలాట భజన బృందం పాటలు పాడుతూ, నృత్యాలతో సందడి చేసింది.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి గౌరవాధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యకర్తలు, ఎం. వేణు (కార్యదర్శి), చిట్యాల ఉప మండలం మహిళా విభాగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply