కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కేడీసీసీ చైర్మన్ మాజీమంత్రి నెట్టెం రఘురాం
చిలకల్లు లో ఘనంగా మేడే వేడుకలు..
పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులు
ఆంధ్రప్రభ జగ్గయ్యపేట : చిల్లకల్లు ఆటో వర్కర్స్ యూనియన్ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ సెంటర్ వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ , జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ , ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.సి.హెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కమ్యూనిస్టు ప్రముఖుడు పుచలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, మే డే కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
శ్రామికుల సంఘటిత శక్తి సమాజ అభివృద్ధికి కీలకమని, దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులే బలమైన పునాది అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.భవన ఇతర నిర్మాణ కార్మికులలో 18.25 లక్షల మందిని నమోదు చేసి, వివాహ కానుకగా రూ 20,000, ప్రసూతి సహాయం రూ 20,000, సహజ మరణానికి రూ 60,000, అంత్యక్రియల ఖర్చులకు రూ 20,000 అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే అసంఘటిత రంగానికి చెందిన 88.53 లక్షల కార్మికులను నమోదు చేసి సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అందించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ 5కే నాణ్యమైన భోజనం అందిస్తూ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “స్వర్ణాంధ్ర 2047” లక్ష్య సాధనలో శ్రామికులే కీలక శక్తి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రావూరు విశ్వనాథం, మండల టిడిపి అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, మండల సమైక్య అధ్యక్షురాలు నాయిని రజిని, ముత్తినేని అశోక్, రావూరి శ్రీనివాసరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఆలూరి రమణ, ఎల్ఎస్సిఎస్ అధ్యక్షులు ధూళిపాళ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షుడు బత్తుల బ్రహ్మం అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు షేక్ అల్లావుద్దీన్, కార్యదర్శి ఎస్కె రజావాలి, కోశాధికారి అబ్బురం మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
