రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం

రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం

  • సమన్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ
  • కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంథని పట్టణంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి శ్రీధర్ బాబు సామాన్య వ్యక్తుల వారితో కలిసిపోయి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల, కర్షకులకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

ఎంతోమంది కార్మికుల త్యాగ ఫలితంగా మేడే దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజ పురోగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. మంథని మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు ఇల్లు లేని వారికి గుర్తింపు ఇచ్చి, త్వరలో వారికి ఇందిరమ్మ ఇల్లు అందించే ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, విద్యుత్ నియంత్రణ కమిటీ సభ్యులు, న్యాయవాది శశుభూషణ్ కాచే, పట్టణ పార్టీ అధ్యక్షుడు పోలు శివ, నాయకులు మంథని సత్యం, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply