విజయవాడ పశ్చిమలో పింఛన్ల పండగ ప్రారంభం..
విజయవాడ పశ్చిమలో పింఛన్ల పండగ ప్రారంభం..
- తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు పంపిణీ…
- డూండి రాకేష్ చేతుల మీదుగా పంపిణి
- 40, 43, 45 డివిజన్లలో పెన్షన్ కార్యక్రమం..
ఆంధ్రప్రభ, భవానిపురం ; విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పింఛన్ల పండగ కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. 40, 43, 45 డివిజన్లలో వివిధ రకాల పింఛన్లను రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీ ఉదయం నుంచే పింఛన్లు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, మంత్రి లోకేష్ సారథ్యంలో, ఎంపీ కేశినేని చిన్ని సూచనలతో కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
40వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఇందుకూరు యువరాజు, శనీశ్వర దేవాలయం డైరెక్టర్ నందిపాటి నరసింహరావు, డివిజన్ అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య, నాయకులు నారాయణ పాల్గొన్నారు. 45వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ, సెక్రటరీ సుభాని, నగర కార్పొరేషన్ డైరెక్టర్ సాయి సుధాకర్, యూనిట్ ఇంచార్జ్ గౌరీ పాల్గొన్నారు. 43వ డివిజన్లో ఇందుకూరు యువరాజ్, మల్లెబోయిన కొండ, కొనికి కొండయ్య, బత్తుల వెంకటేశ్వర్లు సహా కూటమి కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు తెల్లవారుజామునే పింఛన్లు అందడంతో ఆనందం వ్యక్తం చేశారు.
