వికారాబాద్‌లో ఆర్టిజన్ కార్మికుల మే డే వేడుకలు

వికారాబాద్‌లో ఆర్టిజన్ కార్మికుల మే డే వేడుకలు
- సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే)ను ఘనంగా జరుపుకున్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలకు చెందిన ఆర్టిజన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెచ్-82 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సుమారు 19,400 కుటుంబాల జీవనోపాధి దీనిపై ఆధారపడిందని, ఆర్టిజన్ కార్మికులు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మే డే సందర్భంగా కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా డీఈ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెచ్-82 యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, 1104 యూనియన్ నాయకులు మధు, శంకర్ రెడ్డి, టీఆర్వీకే రుక్మయ్య, లక్ష్మణ్ నాయక్, 327 బాలరాజ్, వెంకటేష్, హెచ్-82 శేఖర్, అత్తర్ అలీ, దేవమ్మ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
