కర్నూలులో దారుణ హత్య

మాసూం భాష దర్గా సమీపంలో ఇంతియాజ్ హత్య
హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

కర్నూలు, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలో శుక్రవారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. నగరంలోని మాసూం భాష దర్గా సమీపంలో ఇంతియాజ్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతుడు ఇంతియాజ్ 2014 కర్నూలు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్లు, అనంతరం తెలుగుదేశం పార్టీలో కొనసాగినట్లు సమాచారం. హత్యకు పాత విభేదాలే కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.