పీఎం బహిరంగసభ ఏర్పాట్లు పక్కగా ఉండాలి..
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, ఆంధ్రప్రభ : పీఎం బహిరంగసభ ఏర్పాట్లు పక్కగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు1న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా, తదితర ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఉత్తరాంధ్ర దశ,దిశ మార్చగల ఈ విమానాశ్రయం ప్రతి ఒక్కరికీ ప్రతిష్టాత్మకమేనన్నది అంతా గుర్తెరగాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పి ఏ ఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
