కమ్యూనిస్టు నేత రావేళ్ల శివ రామకృష్ణయ్య మృతి…
చల్లపల్లి – ఆంధ్రప్రభ : విశ్రాంత ఉపాధ్యాయుడు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు రావేళ్ల శివరామకృష్ణయ్య (82) శుక్రవారం ఉదయం మృతి చెందారు. మోపిదేవి మండలం శివరామ పురం గ్రామానికి చెందిన శివరామకృష్ణయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతు విజయవాడ పోరంకి లో తన కుమార్తె ఇంటివద్ద తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఎస్ టీ యు లో రాష్ట కౌన్సిల్ సభ్యునిగా, జిల్లా కార్యదర్శిగా ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. పదవీ విరమణ అనంతరం సిపిఐ దివి ఏరియా కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో నిర్వహించే మెడికల్ క్యాంపులో నిర్వహణ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధించాలనే లక్ష్యంతో డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్, పద్మావతి దంపతులు నిర్వహించే స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రంలో తన వంతు భాగస్వామ్యం అందించే వారు.
