Doctors | మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన..
Doctors | మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన..
Doctors | భవానిపురం, ఆంధ్రప్రభ : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ మెడికల్ క్యాంప్ రెండో రోజు కొనసాగింది.. భావనీపురం 42 వ డివిజన్ హెచ్ బీ కాలనీలో కూడా క్యాంప్ నిర్వహించారు. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి వివిధ ఆరోగ్య సమస్యల పై వైద్యులను సంప్రదించి వైద్య సాయం అందుకున్నారు..
క్యాంప్‌లో భాగంగా పీవీఆర్ హాస్పిటల్స్ సిబ్బంది రక్త పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, పరీక్షలు నిర్వహించారు.. రోగ నిర్ధారణ అయిన వారికి సుజనా ఫౌండేషన్ మందులను సైతం ఉచితంగా అంద చేశారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.



CLICK HERE TO READ MORE Counseling l రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న కర్నూలు పోలీసులు
