22-Carat | పసిడి ప్రియులకు గుడ్ న్యూస్‌

22-Carat | పసిడి ప్రియులకు గుడ్ న్యూస్‌

ఇవాళ తగ్గిన గోల్డ్, సిల్వ‌ర్‌ రేటు
22 క్యారెట్‌ ధ‌ర – రూ.1,39,650
24 క్యారెట్‌ రేటు – రూ.1,52,350
18 క్యారెట్‌ ధర రూ. 1,14,260
రూ. 5000 దిగొచ్చిన వెండి ధర
కేజీకి వెండి ధ‌ర – రూ. 2.65 లక్షలు

22-Carat |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఇన్వెస్టర్లని, పసిడి ప్రియుల‌ను అయోమయానికి గురిచేస్తోంది. ఎప్పుడు ధ‌ర పెరుగుతుందో, త‌గ్గుతుందో తెలియ‌డం లేదు. ఇటీవల మళ్లీ బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అయితే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు ఊరట దక్కింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గగా.. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా దిగొచ్చాయి. మే నెల ఆరంభ రోజున బంగారం, వెండి ధ‌ర‌లు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టాయి. మరి ఇవాళ తులం బంగారం ఎంత? కిలో వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం..

భార‌త్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉంటుంది. మహిళలు ఎక్కువ‌గా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆక‌స్తి చూపుతుంటారు. బంగారం కేవలం అలంకరణగానే కాకుండా.. పెట్టుబడికి మంచి సాధనంగా పనిచేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్లు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 350 తగ్గింది. తులం ధ‌ర రూ. 1,39,650 గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 380 ప‌త‌న‌మైంది. ఈ రోజు తులం రేటు రూ. 1,52,350కు చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 290 తగ్గింది. తులం రూ. 1,14,260 గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే ఇవాళ రూ. 5 వేలు తగ్గడంతో కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 2.65 లక్షల వద్ద ఉంది. నిన్న కిలో వెండి ధర రూ.10 వేలు పెరిగింది. తులం వెండి రూ.2,650కి లభిస్తోంది.

Leave a Reply