ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు (భుదవారం) విచారించారు. ఈ విచారణ దాదాపు 9 గంటల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా ఆయన నుంచి రెండు మొబైల్ ఫోన్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈసారి విచారణ ముగిసినప్పటికీ కేసులో ఇంకా కీలక అంశాలపై స్పష్టత అవసరమైన నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన మరోసారి హాజరు కావాలంటూ అధికారులు ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేశారు. తద్వారా ఆయన మరోసారి సిట్ ముందు హాజరుకానున్నారు.