ViralDrive | స్టీరింగ్ పట్టిన సీఎం విజయ్..

ViralDrive | స్టీరింగ్ పట్టిన సీఎం విజయ్..

ViralDrive | 130 కి.మీ. స్వయంగా డ్రైవింగ్
టోల్‌గేట్ వద్ద అభిమానులకు అభివాదం..
విజయ్ డ్రైవింగ్ వీడియోలు వైరల్
సీఎం విజయ్ ప్రత్యేక స్టైల్..
మూకాంబిక దర్శనం అనంతరం 130 కి.మీ. కారు ప్రయాణం
సూట్‌లో స్టైలిష్ ఎంట్రీ..

ViralDrive | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళూరు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణాన్ని స్వయంగా కారు నడుపుతూ పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఆలయ దర్శనం ముగిసిన తర్వాత విజయ్ తన కాన్వాయ్‌తో కలిసి దాదాపు 130 కిలోమీటర్ల మేర కారు నడిపి మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లో డ్రైవర్లు వాహనాలను నడపడం ఆనవాయితీ కాగా, విజయ్ స్వయంగా స్టీరింగ్ చేపట్టడం అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా సూట్ ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించిన విజయ్, మార్గమధ్యంలోని ఒక టోల్‌గేట్ వద్ద వాహనం నెమ్మదించగా కారు లోపల నుంచే అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రహదారి వెంట గుమికూడారు. విజయ్ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ చేసిన ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆయన సరళత, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు.