వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి
- ఎంపీడీవో యాకూబ్ నాయక్
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ ; ఉపాధి హామీ కూలీలు, రైతన్నలు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎంపీడీవో యాకూబ్ నాయక్ అన్నారు.గురువారం మండలంలోని రాములబండలో ఉపాధి పనులు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని హమాలీల,రైతులు, ఉపాధి కూలీలు, ఎండలో బయట తిరిగేవారు ఉదయం 11 గంటల లోపే పని ముగించుకుని ఇంటి ముఖం పట్టాలని, ఉపాధి పనులు వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీరు, నీడ,ఓ ఆర్ యస్ ప్యాకేట్లు ఉండేలా చూడాలని, గ్రామాల్లో మూగజీవాలకు పశువుల తొట్లలో నీరు ఉంచాలని, ఏర్పాటు చేసిన చలివేంద్రాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట సర్పంచ్ శంకర్ గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్ లింగయ్య, పంచాయతీ కార్యదర్శి మమత ఉన్నారు.
