చిల్లాపురం సబ్ స్టేషన్ ముట్టడి

చిల్లాపురం సబ్ స్టేషన్ ముట్టడి
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలనీ గ్రామస్తులు ధర్నా
సంస్థన్ నారాయణపురం ,ఆంధ్రప్రభ : గ్రామంలో ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం చిల్లాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు గ్రామ సర్పంచ్ రామ నర్సయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు ధర్నా నిర్వహించారు.చిల్లాపురం గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్ లేకపోవడం వల్ల నిరంతరం లో-వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయని, దీనివల్ల రైతుల మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలో పలుచోట్ల కరెంట్ స్తంభాలు విరిగి, కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయని, వీటిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, తమ సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అనంతరం సబ్ స్టేషన్ అధికారులకు గ్రామ పంచాయతీ తరపున వినతిపత్రం అందజేశారు.
