DGPShivdharReddy | కీలక పోస్టు కట్టబెట్టిన సర్కార్
DGPShivdharReddy | ఆంధ్రప్రభ, హైదరాబాద్ : స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించిన సర్కారు కీలక పదవి కట్టబెట్టింది.
శివధర్ రెడ్డి శాంతిభద్రతలు, రోడ్ సేఫ్టీ, నార్కోటిక్స్ ఇతర అంశాలను పర్యవేక్షిస్తారని జీవోలో పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ హోదా కల్పించడంతో పాటు నెలకు రెండు లక్షల 25వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని అందులో పొందుపరిచారు. మూడేళ్ల పదవీకాలం ఉంటుందని ఆయనకు ఓ ఎస్ డి, పర్సనల్ సెక్రెటరీ, ప్రైవేట్ సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్లతో పాటు నలుగురు సిబ్బందిని కేటాయించారు.
