ipl 2026 gt vs rcb| నేడు గుజ‌రాత్‌, బెంగ‌ళూర్ ఢీ

ipl 2026 gt vs rcb| నేడు గుజ‌రాత్‌, బెంగ‌ళూర్ ఢీ

ఐపీఎల్ 2026లో బిగ్ మ్యాచ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆట‌
రాత్రి 7.30గంట‌ల‌కు ప్రారంభం
అద్భుత ఫామ్‌లో బెంగ‌ళూర్
గుజ‌రాత్ జ‌ట్టుకు విజ‌యం త‌ప్ప‌నిస‌రి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో బిగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హైటెన్ష‌న్ ఫైట్‌కు తెరలేవనుంది. రాత్రి 7.30గంట‌ల‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

ఈ సీజన్‌లో బెంగ‌ళూర్ జ‌ట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఆర్‌సీబీ తమ ఫామ్‌ను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు ఈ జ‌ట్టు 8 మ్యాచులు ఆడ‌గా 6 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

మరోవైపు, ఆడిన 8 మ్యాచుల్లో 4 విజయాలతో ఐదో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీల‌కం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క విజయం సాధించాలి. సొంత గ్రౌండ్‌లో మ్యాచు జ‌రుగుతుండ‌టం కార‌ణంగా గుజ‌రాత్‌కు కలిసివచ్చే అంశమ‌ని చెప్ప‌వ‌చ్చు. బెంగ‌ళూర్ జ‌ట్టు బ్యాటింగ్ బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో గుజరాత్ జట్టు బౌలింగ్ రాణించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్ల ఫామ్‌ను అడ్డుకోవడం జీటీ బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. ఈ సీజ‌న్‌లో ఈ రెండు జట్ల మధ్య ఏప్రిల్ 24న జ‌రిగిన మ్యాచులో బెంగ‌ళూర్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోస్తూ కేవలం 19 ఓవర్లలోనే ఛేదించారు.