ఉపాధిహామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధిహామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు కూలీలు ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని పులిమామిడి సర్పంచ్ త్రివేణి చెన్నప్పఅన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడిలో ఉపాధి హామీ పనులు పరిశీలించి మజ్జిగ ఓఆర్ఎస్, పాకెట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఉదయంవేళపనులు చేయాలన్నారు. రైతులు వ్యవసాయ పొలాల్లో చేపట్టే వివిధ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కొలతల ప్రకారం కూలీలకు డబ్బులు చెల్లిస్తుందని కూలీలు కలసికట్టుగా పనులు చేసుకుంటే గిట్టుబాటుకూలివస్తుందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశంలో కూలీలకు వసతులు కల్పించాలనిఅన్నారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్, మేటి నరహరీతదితరులుపాల్గొన్నారు.
