సైబర్ మోసాలపై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ మోసాలపై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి
మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ
మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని షీ టీం ఎస్ఐ హైమా అన్నారు. మంగళవారం మంచిర్యాల నర్సింగ్ కళాశాల విద్యార్థులకు లింగ సమానత్వం, బాల్యవివాహాల నిర్మూలన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల అరికట్టడంలో అందరూ చైతన్యం కావాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపదలో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ సుజాత, షీ టీం పాల్గొన్నారు.
