పోలీస్ శాఖకు రోడ్డు భద్రతా సామగ్రి పంపిణీ..

పోలీస్ శాఖకు రోడ్డు భద్రతా సామగ్రి పంపిణీ..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కీలక చర్యలు చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా పోలీస్ శాఖకు రోడ్డు భద్రతా సామగ్రిని పంపిణీ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగపడే విధంగా, నేషనల్ హైవేస్ (R&B) ఎస్.ఈ జి. సంజీవరాయుడు సమకూర్చిన సామగ్రిని ఈ సందర్భంగా అందజేశారు.

ఇందులో 245 ట్రాఫిక్ కోన్లు, 245 రిఫ్లెక్టివ్ జాకెట్లు, 90 టార్చ్ లైట్లు ఉన్నాయి. ఈ సామగ్రిని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్‌కు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.ఈ సంజీవరాయుడు చేసిన సహకారాన్ని కలెక్టర్ అభినందించగా, పోలీస్ శాఖకు అవసరమైన సామగ్రిని అందించినందుకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కరుణ సాగర్, కదిరి మోటార్ వాహన ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్, నేషనల్ హైవే డీఈ గిద్దయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply