Heavy Rain in Bandar బందరులో భీకర వర్షం

స్తంభించిన జనజీవనం
మచిలీపట్నం : ప్రస్తుతం బందర్ (మచిలీపట్నం) ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైన వర్షం సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. గూడూరు , పెడన, నిదుమోలు, పామర్రు,
చల్లపల్లి లో వానా దంచి కొట్టింది.

దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కూడా ఆలస్యమయ్యాయి. విధులు అనంతరం ఇంటికి వెళ్లాల్సిన వ్యాపార సంస్థల యాజమానులు, కార్మికులు ఎక్కడికక్కడే ఉండిపోయారు.

ఈ రోజు ఉదయంలో నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. సుమారు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం వరకూ వేడి వాతావరణం ఉంది. రాత్రి తొమ్మిది గంటల నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. ఒక్కసారి వర్షం ప్రారంభమైంది. ఎవరూ ఊహించని విధంగా వర్షం పడింది.

