Vijay | ఎన్నికల అఫిడవిట్‌పై పిటిషన్ కొట్టివేత

Vijay | ఎన్నికల అఫిడవిట్‌పై పిటిషన్ కొట్టివేత
Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై గతంలో కూడా మరో పిటిషన్‌ను తిరస్కరించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.
విజయ్ తన భార్య సంగీతకు రూ.12.60 కోట్లు అప్పుగా ఇచ్చానని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే విజయ్-సంగీత దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, అప్పుగా చూపిన ఈ మొత్తం అనుమానాస్పదంగా ఉందని ఓటరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అదే విధంగా ఓ ప్రైవేట్ విద్యా ట్రస్టుకు ఇచ్చిన రూ.20 కోట్ల విషయంలోనూ అఫిడవిట్లో సరైన వివరణ లేదని పిటిషనర్ ఆరోపించారు. ఈ అంశాలపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, ఇదే విషయంపై గతంలో దాఖలైన మరో పిటిషన్‌ను ఇప్పటికే కొట్టివేసినట్లు పేర్కొంది. ప్రస్తుత కేసును కూడా స్వీకరించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో విజయ్‌కు న్యాయపరంగా ఊరట లభించినట్లైంది.
