ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దు

ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దు
-జిల్లాలో 201 పెట్రోల్ బంకులు
-ప్రతి పెట్రోల్ బంక్ వద్ద స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు -జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు, ఆంధ్రప్రభ: ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా విజ్ఞప్తి చేశారు. ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో 201 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ప్రతి పెట్రోల్ బంక్ వద్ద స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. డీజిల్ పెట్రోల్ కొరత సృష్టించినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్: 08647226999 ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృతిక శుక్లా చెప్పారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. ప్రజల్లో ఆందోళన రాకుండా ప్రతి రోజు జాయింట్ కలెక్టర్లు ప్రెస్ మీట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజులో 8,489 కిలోలీటర్ల పెట్రోల్, 10,556 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని అధికారులు, మంత్రికి స్పష్టం చేయడం జరిగిందన్నారు. పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్ బృందాలను పెట్రోల్ బంకుల వద్ద పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అదేశించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం కల్పించి నిల్వలు సమృద్ధిగా ఉంచుతున్నామన్నారు. ఎక్కడైనా కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల పై నిరంతరం, జేసీ, ఆర్ డి ఓ లు, తహశీల్దార్లు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు లేదా, కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని సూచించారు. వ్యవసాయం, పంటల కోత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా పర్యటించిన కలెక్టర్, జేసి, ఎస్పీ, డీఎస్పి, ఆర్డీవోలు, తహసీల్దార్లు…
జిల్లాలోని పెట్రోలు, డీజిల్ బంకులను జిల్లా కలెక్టర్ కృత్తికాశుక్ల, ఎస్పిబి. కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, నరసరావుపేట డిఎస్పి మేదరమెట్ల హనుమంతరావు, సత్తెనపల్లి ఆర్డీవో శ్రీ రాములు, ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు తమ, తమ సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీ నిర్వహించారు.
సత్తెనపల్లి భారత్ పెట్రోల్ బంకు ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ఎవరు పెట్రోల్ డిజిల్, విషయం లో అపోహ పడవద్దని, నిన్న ఆదివారం కావడం తో పెట్రోల్, డిజిల్,లొండింగ్ ఇబ్బంది జరిగిందని కలెక్టర్ స్థానిక వినియోగదారులతో అన్నారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డిజీల్ అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కృత్తికా శుక్ల పెట్రోల్ బంకుల్లో వాహనాలకు స్వయంగా డిజీల్ కొట్టారు.
శావల్యాపురం పెట్రోల్, బీపీసీల్ బంకు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనాసింహ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రికార్డ్స్ పరిశీలించి, అక్కడ ఉన్న వినియోగదారులతో ఆమె మాట్లాడారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఉన్న 201 బంకుల్లో 100 వరకు కలెక్టర్, జెసి, ఎస్పీ జిల్లా ఉన్నతాధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు బంకులను తనిఖీలు చేయడం జరిగింది. నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని ప్రతి మండలంలో ఉన్న పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీ నిర్వహించారు. కాగా జెసి సంజన నరసింహ వినుకొండ నియోజకవర్గం లోని బంకులను తనిఖీ చేశారు. జిల్లాలో ఏ బంకు వద్ద కూడా “నో స్టాక్” అన్న బోర్డులు ప్రదర్శించడానికి వీల్లేదని, ఆ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులను ఆదేశించారు.

