రాఘవరెడ్డి పేటలోమృతదేహం లభ్యం..

రాఘవరెడ్డి పేటలోమృతదేహం లభ్యం..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : రాఘవరెడ్డి పేట గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. ఇందుర్తి గ్రామానికి చెందిన రాజయ్య కొంతకాలంగా రాఘవరెడ్డిపేటలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలో గొర్రెలను కాస్తున్న కాపరులకు తీవ్రమైన దుర్వాసన రావడంతో కుళ్లిన స్థితిలో ఉన్న రాజయ్య మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై అమూల్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
