మాజీ మంత్రి దయాకర్ రావు సేవలు మరువలేనివి

  • బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన సేవలు మరువలేనివని ఎర్రబెల్లి చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు అన్నారు. ఆదివారం మాజీ మంత్రి దయాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా మండలంలోని పలు గ్రామాలతోపాటు పట్టణంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు.బిఆర్ఎస్ మండల,పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 130 పైగా రక్తదానం చేశారు.

కంటయపాలెంలో కంటి పరీక్షలు, చీకటియపాలెంలో అన్నదానం,తొర్రూరు మున్సిపాలిటీలోని అన్నారం రోడ్డులో అల్పాహారం,4 చోట్ల మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉషా దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి దయాకర్ రావు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధికి కృషి చేశాడని, రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పసుమర్తి సీతారాములు,మంగళపల్లి శ్రీనివాస్,తూర్పాటి చిన్న అంజయ్య,ఈదురు ఐలయ్య,నల్ల మాస ప్రమోద్,బిందు శ్రీనివాస్, అంకుష్,ప్రదీప్ రెడ్డి,కుర్ర శ్రీనివాస్, కాలు నాయక్,పేర్ల జంపన్న, తూర్పాటి రవి, మణిరాజ్, మెరుగు ప్రకాష్, వీరారెడ్డి, శీలం లింగన్న, సురేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.