జనగణనతోనే అభివృద్ధి ప్రణాళికలు

జనగణనతోనే అభివృద్ధి ప్రణాళికలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వీయ జనగణన కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అచ్చంపేట తహసిల్దార్ సైదులుతో కలిసి ఆన్‌లైన్ విధానంలో జనగణన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. జనగణన దేశ, రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన గణాంకాలు ఆధారంగా నిలుస్తాయని చెప్పారు. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. డిజిటల్ స్వీయ గణన విధానం ద్వారా సులభంగా, వేగంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని, దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

స్వీయ గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ముందుకు వచ్చి ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేయాలని కోరారు.

Leave a Reply