బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కడెం, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ పార్టీ కడెం మండల కమిటీ ఆధ్వర్యంలో కడెం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ కడెం మండల అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూ రావు, పార్టీ సీనియర్ నాయకులు పల్లె మల్లారెడ్డి, ముబారక్ కోల నరేష్, ఇస్లావత్ గంగన్న, జి వేణుగోపాల్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, నరసయ్య, మల్లేష్, ఎండి హసీబ్, సపవాత్ రవి, కానగంటి మల్లేష్, జీల నాగ రాజు, బీఆర్ఎస్ పార్టీ కొండుకూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కళ్లెం తిరుపతిరెడ్డి, పాండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగాధర్, కడెం గ్రామ కమిటీ అధ్యక్షులు కే రవి, నాయకులు కోల నరేష్, జాడి నరసయ్య, కోటయ్య, చిట్టేటి గణేష్, సమ్మేటి రాజన్న, నవీద్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
