రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…
రేగొండ, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందిన సంఘటన రేగొండ మండలం,చెన్నాపూర్ గ్రామ శివారు పెట్రోల్ పంపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలగిరి గ్రామానికి చెందిన సుంకరి రవీందర్(50) అక్కడికక్కడే (స్పాట్లో) మృతి చెందాడు. పరకాలలో వివాహ వేడుకకు హాజరై ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో భూపాలపల్లి నుండి పరకాల వైపు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు చలి వాగు సమీపంలో ఢీకొనడంతో మృతి చెందాడు.
