స్నేహ సొసైటీ సేవలు అభినందనీయం…

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : స్నేహ సొసైటీ సేవలు అభినందనీయమని స్నేహ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎం మహిపాల్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సవితరాణిలు తెలిపారు. నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ 34వ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య ఎస్ జ్యోతి సమాజ హిత కార్యక్రమాలకు నూతన వ్రవాడితో శ్రీకారం చుడుతూ ముందుకు వెళుతున్నారని కొనియాడారు. వారి సేవలు అమోఘమని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగం అందిస్తున్న ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరిస్తూ వారి సేవలు చేయడం గొప్ప విషయమని అన్నారు. అప్పటి కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డితోపాటు గత కలెక్టర్లు డాక్టర్ యోగితా రానా ఇతర అధికారుల ప్రోత్సాహంతో దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. 100 విద్యార్థులకు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించడం పట్ల స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి కావ్యదర్శి యస్ సిద్దయ్యలను ప్రత్యేకంగా అభినందించారు.

ఎంతోమంది విద్యార్థుల కోసం స్నేహ సొసైటీ సిబ్బంది సహకారంతో కృషి చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. నిజామాబాద్ మంచిర్యాల బైంసాలలో స్నేహ సొసైటీ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి సరుకులను తక్కువ ధరకు సిబ్బందికి అందించే విధంగా మరో ముందు అడుగు వేయడం పట్ల అభినందించారు. డాక్టర్ సవితారాణి రమణ రెడ్డి సహకారంతో స్నేహ సొసైటీ ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేర్ల దయానంద్ తాటి వీరేశం సుధాకర్ ఆయా ప్రాజెక్టుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply