Regonda ‘ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ బడులు ముద్దు’

Regonda ‘ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ బడులు ముద్దు’

  • జగ్గయ్యపేటలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు

రేగొండ(Regonda), ఆంధ్రప్రభ:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలంలోని జగ్గయ్యపేట గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

“ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ బడులు ముద్దు” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, నాణ్యమైన విద్యా సదుపాయాలను ప్రజలకు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 23 రకాల ఉచిత వస్తువులు అందించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఉదయం పాలు, అల్పాహారం, పాఠశాలకు దూరంగా ఉన్న గ్రామాల విద్యార్థులకు సంవత్సరానికి రూ.6 వేల రవాణా భత్యం, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒంటేరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ నడిపెల్లి శాంతాదేవి-వెంకట్రావు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply