వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యే సామెల్

మోత్కూర్, ఆంధ్రప్రభ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేస్తున్న బూడిద ఈశ్వర్ వివాహ వేడుకలు ఆదివారం మోత్కూర్ లోని ఎల్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా ఆ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులు ఈశ్వర్, శ్రావణి లను ఎమ్మెల్యే సామెల్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య,మాజీ సింగిల్ విండో చైర్మన్ పి వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ నాయకులు బద్ధం నాగార్జున రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్,మైనారిటీ సెల్ నాయకులు ఎం డి జావేద్ తదితరులు పాల్గొన్నారు.
