ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన మహోత్సవం పరకాల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బెజ్జంకి కరుణాకరశాస్త్రి ఆచార్యత్వంలో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పరకాల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెలకంటి శ్రీనివాసా చారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలోజు లింగమూర్తి, మండల ఉపాధ్యక్షులు వెల్లంకి బుచ్చయ్య, ఆచారి గౌరవాధ్యక్షులు తెలకుంట్ల కోటిలింగాచారి, చంద్రమౌళి ఆచారి, కోశాధికారి కడి వెండి రవి, ప్రధాన కార్యదర్శి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.