Governor | స్వీయ గ‌ణ‌న చేసుకున్న రేవంత్‌

Governor | స్వీయ గ‌ణ‌న చేసుకున్న రేవంత్‌

Governor | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో 2027 జ‌న‌గ‌ణ‌న తొలి విడత ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. అలాగే అధికారుల స‌మ‌క్షంలో వెబ్‌సైట్ ద్వారా త‌న వివ‌రాల‌ను సీఎం రేవంత్ కూడా న‌మోదు చేసుకున్నారు.

జ‌న‌గ‌ణ‌న‌లో ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములై ఈ ప్ర‌క్రియ‌ను స‌క్సెస్ చేద్దామ‌ని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారుల సమక్షంలో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ (స్వీయ గణన) ద్వారా తన జనాభా లెక్కల వివరాలను నమోదు చేసుకున్నారు. కాగా, మే 11 వ‌ర‌కు స్వీయ గ‌ణ‌న చేసుకునేందుకు అవకాశం క‌ల్పించారు.

Leave a Reply