Chidambaram Stadium | టాస్ గెలిచిన గుజరాత్

Chidambaram Stadium | టాస్ గెలిచిన గుజరాత్
Chidambaram Stadium | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు (ఏప్రిల్ 26) మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగబోతోంది. చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్.. ఇరు జట్లకు చాలా కీలకమైనది. ఈసందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్‌గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో చెన్నై మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ధోనీ ఈ మ్యాచులోనూ ఆడటం లేదని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు.
